
భారత్కు అత్యంత వ్యూహాత్మక భాగస్వామి, కీలక పొరుగుదేశమైన బంగ్లాదేశ్.. క్రమంగా మనకు దూరం జరుగుతోంది. గతంలో ఎన్నడూలేనంతంగా ఇరు దేశాల మధ్య సంబంధాల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. దీనికి బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం ఇవ్వడం ఓ కారణం. స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ విద్యార్థులు, యువత చేపట్టిన ఉద్యమంతో హసీనా పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ప్రాణాలు కాపాడుకోడానికి ఢాకా నుంచి ఆమె ఢిల్లీకి చేరుకున్నారు.