
ఇంటర్నెట్ డెస్క్‌: ఆసియా కప్‌ విజేతగా భారత మహిళా జట్టు (Womens Team India) నిలిచింది. కానీ, ఈ టోర్నీలో జట్టు ఫీల్డింగ్‌ మాత్రం కలవరానికి గురి చేసింది. ఐదు మ్యాచుల్లో ఒక్క ఓటమి కూడా లేకుండానే కప్పును సొంతం చేసుకున్నప్పటికీ.. 13 క్యాచులను జారవిడిచిట్లు గణాంకాలు చెబుతున్నాయి. మన తర్వాత ఏడు క్యాచ్‌లు వదిలేసిన ఇండోనేషియా ఉంది. ఈ క్రమంలో భారత ఫీల్డింగ్‌ వైఫల్యంపై కోచ్ మజుందార్ స్పందించాడు. ఈ విభాగంలో మెరుగుపడాల్సిన అవసరం ఉందని అంగీకరించాడు. ‘‘అవును. మేం చాలా ఇంప్రూవ్ కావాల్సి ఉంది. కొన్ని క్యాచులను వదిలేసినా.. ఫీల్డింగ్‌ బాగానే చేశాం. కానీ, ఈ విషయంపై దృష్టిపెట్టి తీవ్రంగా శ్రమిస్తాం. గంటలతరబడి సాధన చేస్తాం. ఇంకా మెరుగ్గా మారతాం. ఆ దిశగా నిజాయతీగా కష్టపడతాం. ఇక మిడిలార్డర్‌ బ్యాటింగ్‌పైనా కామెంట్లు వస్తున్నాయి. ఇక్కడి పరిస్థితులు చాలా క్లిష్టమైనవి. బ్యాటింగ్‌ చేయడం తేలికేం కాదు. మిడిలార్డర్‌తో మాకెలాంటి ఇబ్బంది లేదు. బ్యాటింగ్‌లో అద్భుతమైన భాగస్వామ్యాలను నమోదు చేశాం. షఫాలీ, స్మృతి మంధాన చాలా బాగా ఆడారు. ప్రతి ఒక్కరూ పరుగులు రాబట్టాలని కాదు.. టీ20 క్రికెట్‌లో కొన్ని మూమెంట్స్‌ అలానే ఉంటాయి. ఓపెనింగ్‌లో దూకుడుగా ఆడతారు. ఫినిషింగ్‌ బాగా చేస్తారు. దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ 150 సగటున పరుగులు చేశాం. మా క్యాంపుల్లోనూ సింగిల్స్, డబుల్స్‌ విషయంలోనూ కసరత్తు చేస్తాం. అయితే, దుబాయ్‌ వేడి దెబ్బకు శరీరం త్వరగా అలసిపోతుంది. ఇలాంటి కష్టాలను దాటి విజేతగా నిలిచాం. అయితే, దీనితో సంతృప్తి చెందం. రాబోయే టోర్నీ కోసం సన్నద్ధమవుతాం’’ అని మజుందార్‌ (Muzumdar) స్పష్టం చేశాడు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌ను టీమ్‌ఇండియా ఘనంగా ఆరంభించింది.





