
మన పూర్వీకులు ఆహారంలో నెయ్యికి ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా, దానిని ఒక ఔషధంగా పరిగణించేవారు. సాధారణంగా నెయ్యిని అన్నంలో, పప్పులో లేదా రొట్టెలపై రాసుకుని తింటుంటాం. అయితే, ప్రతిరోజూ ఉదయం పరగడుపున గోరువెచ్చని నీటిలో కేవలం ఒక టీస్పూన్ నెయ్యి కలిపి తాగడం వల్ల శరీరంలో ఆశ్చర్యకరమైన మార్పులు వస్తాయని ప్రముఖ న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు.





