
ఇంటర్నెట్‌ డెస్క్‌: 78వ ప్రైమ్‌ టైమ్ ఎమ్మీ అవార్డుల వేడుకల్లో ‘విడోస్ బే’ (Widow’s Bay) వెబ్ సిరీస్ సత్తా చాటింది. కామెడీ-హారర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్.. ఏకంగా 14 అవార్డులను కైవసం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. లాస్ ఏంజెలెస్‌లోని పీకాక్ థియేటర్‌లో సోమవారం జరిగిన ఎమ్మీ అవార్డుల ప్రదానోత్సవం (Emmy awards)లో ఈ సిరీస్ హవా కొనసాగింది. మొత్తం 19 విభాగాల్లో నామినేట్ కాగా.. 14 పురస్కారాలను తన ఖాతాలో వేసుకుంది. ఒకే సీజన్‌లో ఇన్ని అవార్డులు గెలుచుకున్న తొలి కామెడీ సిరీస్‌గా ఇది రికార్డులకెక్కింది. ‘ఉత్తమ కామెడీ సిరీస్’ అవార్డుతో పాటు మ్యాథ్యూ రైస్, కేట్ ఓఫ్లిన్, స్టీఫెన్ రూట్, బెట్టీ గిల్పిన్‌లకు నటన విభాగాల్లో అవార్డులు దక్కాయి. అలాగే ఉత్తమ రచన, దర్శకత్వం విభాగాల్లోనూ ఇది తన సత్తా చాటింది. ఒక మారుమూల దీవిలో ఉండే తీరప్రాంత పట్టణం చుట్టూ ఈ కథ సాగుతుంది. ఆ ఊరి మేయర్ టామ్ లోఫ్టిస్ (మ్యాథ్యూ రైస్).. ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా మార్చాలనుకుంటాడు. ఈ క్రమంలో ఆ ఊరికి ఒక శాపం ఉందని తెలుసుకుంటాడు. ఊరి చరిత్రలో భాగంగా ఆ శాపాన్ని అంగీకరించడానికి బదులు, దాన్ని పూర్తిగా తొలగించాలని నిర్ణయించుకుంటాడు. దాన్ని వదిలించుకునేందుకు ఆ ఊరి ఏర్పాటుకు కారణమైన వ్యక్తి వంశంలో బతికున్న ఏకైక వారసురాలిని అంతం చేయాలనుకుంటాడు. 84 ఏళ్ల రుత్ అనే వృద్ధురాలిని ఆ వారసురాలిగా స్థానికులు భావిస్తుంటారు. ఆ తర్వాత, మేయర్ ఏం చేశాడు? కథ ఎలాంటి మలుపులు తిరిగిందన్నది సిరీస్‌లో చూడాల్సిందే. మ్యాథ్యూ రైస్, కేట్ ఓఫ్లిన్, స్టీఫెన్ రూట్ తదితరుల అద్భుత నటన, విభిన్నమైన కథాంశంతో సాగే ఈ సిరీస్‌ను ‘యాపిల్ టీవీ ప్లస్’ (Apple TV+) ఓటీటీలో చూడొచ్చు. అలాగే ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లోనూ అందుబాటులో ఉంది. కాగా, గత జూన్‌లోనే ఈ సిరీస్‌కి సంబంధించి రెండో సీజన్‌ను కూడా ప్రకటించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. చంద్ర సిద్ధార్థ్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’. ఇంటర్నెట్‌ డెస్క్: ముంబయిలోని ముకేశ్ అంబానీ నివాసం ఆంటిలియాలో గణేశ్ చతుర్థి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ప్రతి ఏటా ఆనవాయితీగా నిర్వహించే ఈ వేడుకలకు ఈసారి కూడా సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై సందడి చేశారు. తారల రాకతో అంబానీ నివాస ప్రాంగణంలో పండుగ వాతావరణం మరింత కోలాహలంగా మారింది. ఆ ఫొటోలు మీకోసం మ్యూజిక్‌ డైరెక్టర్‌గా వరుస సినిమాలతో ఆకట్టుకుంటోన్న జీవీ ప్రకాశ్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఇమ్మోర్టల్‌’.




