
పాకిస్థాన్ క్రికెట్లో బ్యాటింగ్ టాలెంట్ ఎందుకు రావడం లేదు? ఇదే ప్రశ్న ఇప్పుడు ఆ దేశ క్రికెట్లో హాట్ టాపిక్‌గా మారింది. దీనికి కారణం కూడా పాకిస్థాన్ మాజీ స్టార్ బౌలర్ వసీం అక్రమ్ స్వయంగా చెప్పడం ఆసక్తికరంగా మారింది. పాకిస్థాన్ సూపర్ లీగ్.. అంటే PSL ప్రారంభమై దాదాపు పదేళ్లు అవుతున్నా.. ఒక్క మంచి బ్యాటర్‌ను కూడా ఎందుకు తయారు చేయలేకపోయిందని వసీం అక్రమ్ ప్రశ్నించారు. బౌలర్లను మాత్రం కొంతమందిని తయారు చేశామని.. కానీ గుర్తుండిపోయే బ్యాటింగ్ టాలెంట్ ఎవరొచ్చారని ఆయన నిలదీశారు. ఈ సందర్భంగా భారత్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని అక్రమ్ ఉదాహరణగా ప్రస్తావించారు. కేవలం 14 ఏళ్ల వయసులోనే వైభవ్ చూపిస్తున్న ప్రతిభ లాంటి బ్యాటింగ్ టాలెంట్ పాకిస్థాన్ నుంచి కూడా రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో పాకిస్థాన్ బ్యాటర్లు ధైర్యంగా ఆడలేకపోతున్నారని కూడా అక్రమ్ విమర్శించారు. మంచి బ్యాటింగ్ టాలెంట్ రావాలంటే.. ముందుగా దేశంలో క్లబ్ క్రికెట్‌ను బలోపేతం చేయాలని సూచించారు. కరాచీ, లాహోర్ నగరాల్లో క్లబ్ క్రికెట్ అభివృద్ధికి PCB భారీగా నిధులు ఖర్చు చేయాలని అక్రమ్ సూచించారు. ఎందుకంటే.. అసలైన ప్రతిభ పుట్టుకొచ్చేది క్లబ్ క్రికెట్ నుంచే అని అక్రమ్ స్పష్టం చేశారు. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి వలలో చిక్కిన 23 కేజీల “పండుగప్ప”.. వేలంలో కళ్లుచెదిరే రేటు! ఇక గోరింటాకు కూడా మెషీన్‌తోనే.. మరికొన్ని ఉద్యోగాలు హుష్! పాము కాటుకి సరికొత్త విరుగుడు! 100 ఏళ్ల సమస్యకి చెక్!





