
సంగెం, న్యూస్‌టుడే: భర్త వేధింపులు భరించలేక ఓ మహిళ ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడిన ఘటన వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం ధర్మారంలో శనివారం చోటు చేసుకుంది. సీఐ విశ్వేశ్వర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం పూరీ జిల్లా అస్తరంగ మండలం రిసోల్‌ గ్రామానికి చెందిన మిల్లీ బిస్వాల్‌(21)కు జంగేశ్వర్‌పూర్‌కు చెందిన గుప్తేశ్వర్‌ బిస్వాల్‌కు 2026 జూన్‌లో వివాహం జరిగింది. అనంతరం వరంగల్‌కు వచ్చి ధర్మారంలోని ఓ అద్దె ఇంట్లో నివాసముంటూ కాకతీయ వస్త్ర పరిశ్రమలో ఉద్యోగం చేస్తున్నారు. గుప్తేశ్వర్‌ తన భార్యపై అనుమానం వ్యక్తం చేస్తూ తరచూ వేధింపులకు, గురిచేసేవాడు. మిల్లీ బిస్వాల్‌ ఈ నెల 8న తన తల్లికి ఫోన్‌ చేసి తన భర్త వేధిస్తున్నాడని తెలిపారు. శనివారం ఉదయం తన భార్య ఉరేసుకొని మృతి చెందిందని గుప్తేశ్వర్, మిల్లీ బిస్వాల్‌ తల్లికి ఫోన్‌ చేసి సమాచారం అందించాడు. మృతురాలి మేనమామ దిలీప్‌ మహంతి ఫిర్యాదు మేరకు గుప్తేశ్వర్‌పై ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




