
విజయనగరం: ఇటీవల తెదేపాలో చేరిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీను.. గోవా గవర్నర్‌ అశోక్ గజపతిరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. గోవా లోక్‌భవన్‌కు వెళ్లి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెదేపాలో పెద్దల ఆశీస్సులు తీసుకోవడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా చిన్న శ్రీను అన్నారు. విజయనగరం, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. చిన్న శ్రీను, ఆయన కుమార్తెకు అశోక్‌ గజపతిరాజు శుభాకాంక్షలు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.






