
విజయనగరం రూరల్‌: వైకాపా ప్రభుత్వంలో నిర్వహించిన ఏపీపీఎస్సీ నియామకాల్లో అనేక అక్రమాలు జరిగాయని ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఆరోపించారు. వేలాదిమంది అభ్యర్థులు కష్టపడి పరీక్షలు రాస్తే ఆనాటి జగన్‌ ప్రభుత్వం ఇష్టానుసారంగా, లోపభూయిష్టంగా మూల్యాంకనం చేసిందని ఎద్దేవా చేశారు. బుధవారం గురజాడ గ్రంథాలయం దగ్గర ఉన్న ఓ పోటీ పరీక్షల కేంద్రానికి వెళ్లి ఆమె వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లు విజయవంతంగా మెగా డీఎస్సీ నిర్వహిస్తే.. వైకాపా కావాలనే దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. యువత ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా ఆ పార్టీ ప్రవర్తన ఉందన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని, నిరుద్యోగ యువతకి పరిశ్రమలు తీసుకువచ్చి ఉపాధి అవకాశాలు కలిపిస్తున్నామని వివరించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





