
విజయనగరం రూరల్: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 17, 18 తేదీల్లో విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో కౌశలం డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. గ్రీన్‌టెక్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ (జీటీఐ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ డ్రైవ్‌లో 700 ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఫౌండ్రీ విభాగంలో 400, మెషినింగ్ విభాగంలో 300 పోస్టులు భర్తీ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. 18 నుంచి 32 సంవత్సరాల వయస్సు గల పురుషులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చన్నారు. ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, ఏదైనా ట్రేడ్, డిప్లొమా లేదా బీటెక్ (మెకానికల్) విద్యార్హత కలిగిన వారు, ఫ్రెషర్లు కూడా ఇంటర్వ్యూకు హాజరు కావచ్చని తెలిపారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.