
అనకాపల్లి పట్టణం: ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా అనకాపల్లి నూకాలమ్మ ఆలయంలో ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, కూటమి పార్టీల నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అనకాపల్లిలోని ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. అనకాపల్లి ఎంపీ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ సీఎం రమేశ్‌ మాట్లాడుతూ 25 ఏళ్లుగా దేశసేవకు అంకితమైన ప్రధాని మోదీ ప్రపంచ దేశాల్లో భారత్‌ను అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తున్నారని కొనియాడారు. నరేంద్రమోదీ నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని తెలిపారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




