
విశాఖపట్నం: ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని గదిరాజు ప్యాలెస్‌లో నిర్వహిస్తున్న బిజినెస్ ఎక్స్‌పో-2026ను రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత మూడో రోజు సందర్శించారు. ఈ సందర్భంగా బిజినెస్ ఎక్స్‌పోలో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను మంత్రి పరిశీలించారు. హోం మంత్రి అనితకు ఏపీ ఛాంబర్స్ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎక్స్‌పోలో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను పరిశీలించారు. ఆయా సంస్థల ఉత్పత్తులు, సేవలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. వ్యాపార, పారిశ్రామిక రంగాల అభివృద్ధి, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఇలాంటి ఎక్స్‌పోలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ అభిషిక్త్‌ కిశోర్‌, ఏపీ ఛాంబర్స్ ప్రతినిధులు, నిర్వాహకులు, పారిశ్రామికవేత్తలు తదితరులు పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





