
అమరావతి: వినాయకచవితి ( Ganesh Chaturthi ) సందర్భంగా సీఎం చంద్రబాబు ( Chandrababu ) నివాసంలో పూజలు నిర్వహించారు. సతీమణి భువనేశ్వరి, మనవడు దేవాంశ్‌, కుటుంబసభ్యులతో కలిసి సీఎం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మేరకు ‘ఎక్స్‌’లో ఫొటోలను ఆయన షేర్‌ చేశారు. కుటుంబంతో కలిసి నిర్వహించిన గణనాథుడి పూజ ఎంతో గొప్ప ఆధ్యాత్మిక అనుభూతినిచ్చిందన్నారు. ‘‘గణపతి జ్ఞానానికి, వివేకానికి, విజయానికి ప్రతీక. ఏ శుభకార్యాన్నైనా వినాయక పూజతో ప్రారంభించడం మన సంప్రదాయం. విఘ్నాలను తొలగించి, సన్మార్గాన్ని చూపే చవితి వేడుకలు మనకు సామాజిక స్పృహ, ఐక్యతను నేర్పిస్తాయి. సమష్టితత్వాన్ని బోధిస్తాయి. ఆధ్యాత్మిక చైతన్యానికి నిలువెత్తు ప్రతీకగా కనిపిస్తాయి. వినాయకుడి ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలి. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ఎదురయ్యే విఘ్నాలన్నీ తొలగి.. రాష్ట్రం సుభిక్షంగా, తెలుగు జాతి వర్థిల్లేలా ఆనందంగా ఉండాలని గణనాథుడిని ప్రార్థించాను. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు’’ అని సీఎం పేర్కొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





