
హైదరాబాద్‌: రాష్ట్రంలో మరో 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు తెలంగాణ రక్షణ సేన ఇన్‌ఛార్జిలను పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. మెదక్ లోక్‌సభ సహా పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాలకూ అధ్యక్షులను నియమించారు. వినాయక చవితి సందర్భంగా సోమవారం నూతన నియామకాల వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్, మహబూబ్‌నగర్‌, కంటోన్మెంట్, కుత్బుల్లాపూర్, ఇబ్రహీంపట్నం, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్‌ రూరల్, నిర్మల్, ఖానాపూర్, అంబర్‌పేట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, హుజూరాబాద్, పటాన్‌చెరు, దేవరకొండ, నాంపల్లి, ఇల్లందు, అశ్వారావుపేట నియోజకవర్గాలకు పార్టీ బాధ్యుల్ని నియమించారు. ఇప్పటికే 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జిలను ప్రకటించిన కవిత.. తాజా ప్రకటనతో కలిపి మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు బాధ్యుల నియామకం పూర్తి చేశారు. తొమ్మిది జిల్లాలకు టీఆర్ఎస్ అధ్యక్షులతో పాటు మూడు జిల్లాలకు ప్రధాన కార్యదర్శులను కూడా కవిత నియమించారు. అనుబంధ విభాగాలైన ఎంబీసీ, న్యాయ, ఎన్ఆర్ఐ, ట్రేడ్ అండ్ కామర్స్, విద్యార్థి, సోషల్ మీడియా, ముస్లిం మైనార్టీ, రైతు, బంజారా, జర్నలిస్ట్, ట్రేడ్ యూనియన్ విభాగాలకు కూడా అధ్యక్షులను ప్రకటించారు. గతంలో మాదిరిగానే అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, జిల్లా అధ్యక్షుల నియామకాల్లో బీసీలకు పెద్దపీట వేసినట్లు టీఆర్ఎస్ పార్టీ తెలిపింది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. నల్గొండ (Nalgonda) జిల్లా నేరడుగొమ్ము మండలం వైజాగ్‌ కాలనీలో ఓ కారు (car) బీభత్సం సృష్టించింది. జగిత్యాల(Jagitial) జిల్లాకు చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ మరోసారి తన ప్రతిభను చాటారు.




