
హైదరాబాద్, సెప్టెంబర్ 14: అమెరికాలోని ప్రభుత్వ నిధులతో నడిచే మెడికేర్ ఆరోగ్య బీమా కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకుని భారీ మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఓ టెక్సాస్ ల్యాబొరేటరీ యజమానిపై నమోదయ్యాయి. ‘అమెరికన్ ప్రీమియర్ ల్యాబ్స్’ అనే జన్యుపరీక్షల ల్యాబ్‌లో జన్యు పరీక్షలకు సంబంధించి సుమారు 93 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.800 కోట్లకు పైగా) తప్పుడు క్లెయిమ్‌లను సమర్పించినట్లు అమెరికా ఫెడరల్ అధికారులు ఆరోపించారు. ఈ క్రమంలో ఖదీర్‌ఖాన్ 2023 ఆగస్టు నుంచి 2024 అక్టోబరు మధ్యకాలంలో సుమారు 93 మిలియన్ డాలర్ల నకిలీ మెడికల్ క్లెయిమ్‌లను అమెరికా ప్రభుత్వానికి సమర్పించాడు. వీటిలో కనీసం 63 మిలియన్ డాలర్ల క్లెయిమ్‌లకు మెడికేర్ చెల్లింపులు చేసినట్లు పేర్కొన్నారు. టెక్సాస్‌లోని రిచర్డ్సన్కు చెందిన American Premier Labs LLC యజమాని ఖదీర్ ఖాన్ మొహమ్మద్ (46) ఈ వ్యవహారానికి పాల్పడ్డాడు.





