
పీఎంపాలెం : వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో పీఎం పాలెం సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న తుమురుగడ్డ జలాశయం వద్ద విగ్రహాల నిమజ్జనానికి అవకాశమున్నా అధికారుల పర్యవేక్షణ శూన్యమైంది. గతంలో ఈ జలాశయానికి వెళ్లే మార్గంలోని చెక్‌గేట్‌ వద్ద అటవీ సిబ్బంది కాపలా ఉండి ఎవరినీ అనుమతించేవారు కాదు. కానీ ప్రస్తుతం ఇక్కడ నిఘా కొరవడటంతో, వన్యప్రాణుల దాహార్తిని తీర్చే ఈ ప్రధాన నీటి వనరు కలుషితం కావడంతో పాటు నిమజ్జనాలకు వెళ్లేవారు ప్రమాదాల బారిన పడే ముప్పు పొంచి ఉంది. పర్యావరణ హాని, అవాంఛనీయ ఘటనలు జరగకుండా అటవీ, పోలీసు అధికారులు తక్షణమే స్పందించి జలాశయం వద్ద పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





