
ఫాంహౌస్ల సందర్శన పేరుతో టూరిజం స్థలాలకు వెళ్లినట్లు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బస్సుల్లో వెళ్లి ఏం చేశారని, అక్కడికి వెళ్లి ఏం సాధించారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు.
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

ఫాంహౌస్ల సందర్శన పేరుతో టూరిజం స్థలాలకు వెళ్లినట్లు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బస్సుల్లో వెళ్లి ఏం చేశారని, అక్కడికి వెళ్లి ఏం సాధించారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు.
ఖైరతాబాద్‌లో భారాసకు అభ్యర్థి లేరు కాంగ్రెస్, భాజపాల నడుమే పోటీ: బండి సంజయ్‌ కరీంనగర్‌ నగరపాలికలో ఫాగింగ్‌ వాహనం ప్రారంభిస్తున్న బండి సంజయ్‌. చిత్రంలో మేయర్‌ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్‌ సునీల్‌రావు, కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ తదితరులు కరీంనగర్‌ కార్పొరేషన్, న్యూస్‌టుడే: ఫాంహౌస్‌ల సందర్శన పేరుతో టూరిజం స్థలాలకు వెళ్లినట్లు కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బస్సుల్లో వెళ్లి ఏం చేశారని, అక్కడికి వెళ్లి ఏం సాధించారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ ప్రశ్నించారు. కరీంనగర్‌ కార్పొరేషన్‌లో కొత్తగా కొనుగోలు చేసిన రెండు ఫాగింగ్‌ మిషన్లు, ట్రైసైకిళ్ల పంపిణీని మేయర్‌ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్‌ సునీల్‌రావుతో కలిసి ఆదివారం ప్రారంభించారు. అనంతరం బండి సంజయ్‌ విలేకరులతో మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఆధారాలు ఉన్నాయని అన్నప్పుడు అధికారులను పంపించాలి. అరెస్టు చేసి స్థలాలు స్వాధీనం చేసుకోవాలి. అంతేగాని వారే పోవడం ఏమిటి? 22ఏపై ఫిర్యాదు చేసిందే భాజపా. దాదాపు కోటి ఎకరాల భూములను నిషేధిత జాబితాలో పెట్టారు. గతంలో భారాస, ఇప్పుడున్న కాంగ్రెస్‌ 22ఏను వారికి అనుకూలంగా మార్చుకున్నాయి. ఇలాంటి వాటిపై అసెంబ్లీలో చర్చ జరగలేదు. ప్రధాన ప్రతిపక్షాన్ని సస్పెండ్‌ చేశారు. భాజపా ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. పూర్తిగా ఏకపక్షంగా అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. అనర్హత వేటుపై హైకోర్టు తీర్పు పాటిస్తామని చెప్పిన దానం నాగేందర్‌ మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఉప ఎన్నికకు భాజపా సిద్ధంగా ఉంది. మా పార్టీలో అభ్యర్థుల విషయంలో పోటీ ఉంది. భారాసకు అభ్యర్థి లేరు. కాంగ్రెస్, భాజపా మధ్యే పోటీ. కాంగ్రెస్‌ మైనార్టీ ఓటర్ల ద్వారా గెలవాలని చూస్తుంది. వరంగల్‌ విమానాశ్రయానికి ఓరుగల్లు, కాకతీయులు, రుద్రమదేవి వంటి పేర్లు పెట్టాలని లేదంటే సమ్మక్క సారలక్క పేరైనా పెట్టాలి. సీఎం సీటు కాపాడుకోవడం కోసం డూప్లికేట్‌ గాంధీ కుటుంబం పేరు పెడితే ఒప్పుకోం’ అని బండి సంజయ్‌ పేర్కొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: Eenadu లో చూడండి







