
రష్యా ఆంక్షల బిల్లుకు యూఎస్ హౌస్ ఆమోదం తెలిపింది. రిపబ్లికన్ల ఆధ్వర్యంలోని ప్రతినిధుల సభ ఈ బిల్లును 262-159 ఓట్ల తేడాతో ఆమోదించింది. ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చినప్పటినుండి మాస్కోకు వ్యతిరేకంగా అమెరికా చేపట్టిన అత్యంత కీలకమైన బిల్లుకు కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. రష్యా చమురు, గ్యాస్‌ను కొనుగోలు చేసే దేశాలపై (చైనా, భారత్‌లతో సహా) 100 శాతం వరకు సుంకాలు విధించే అధికారాన్ని కూడా ఈ బిల్లు ట్రంప్‌నకు కల్పిస్తుంది.