
విజయనగరం జిల్లాలోని కందిపేటలో ఓ ప్రియురాలు తన ప్రియుడిపై యాసిడ్‌ పోసి హత్య చేసింది. కొన్నిరోజులుగా భర్తకు దూరంగా ఉంటున్న ఓ వివాహిత తన బావ కుమారుడైన శ్రీనుతో సన్నిహితంగా ఉంటుంది. శ్రీను తన భార్యకు దూరంగా ఉంటూ వివాహితతో సహజీవనం చేస్తున్నాడు. వీరిమధ్య ఘర్షణ తలెత్తడంతో ప్రియుడు శ్రీను తలపై ఇనుపరాడ్డుతో కొట్టిన ప్రియురాలు, అతనిపై యాసిడ్‌ పోసి హత్య చేసింది.





