
దివంగత నటి శ్రీదేవి ఆస్తి వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. చెన్నై ఈస్ట్‌ కోస్ట్‌ రోడ్డులో 4.77 ఎకరాల స్థలానికి సంబంధించి శ్రీదేవి కుటుంబం వివాదం ఎదుర్కొంటోంది. శ్రీదేవి ఈ స్థలాన్ని సంబంధ ముదలియార్‌ అనే వ్యక్తి కుటుంబం నుంచి కొనుగోలు చేశారు. ఈ స్థలం 37 ఏళ్లుగా శ్రీదేవి కుటుంబీకుల ఆధీనంలోనే ఉంది. ఈ ఆస్తిలో తమకు వాటా ఉందని పేర్కొంటూ సంబంధ ముదలియార్‌ కుటుంబ సభ్యులు కొందరు కోర్టును ఆశ్రయించారు. దీనిపై తాజాగా అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది. తదుపరి విచారణ వరకు యథాతథ స్థితి విధిస్తూ.. వాదప్రతివాదులకు నోటీసులిచ్చింది.




