
బెంగళూరు: కర్ణాటక వ్యవసాయ విశ్వ విద్యాలయ మాజీ ఉపకులపతి, ఉద్యాన వన రంగ నిపుణుడు డాక్టర్ మంజునాథ నాయక్ మృతి చెందారు. ఉత్తర కన్నడ జిల్లా కుమట తాలూకా కోనల్లి గ్రామంలోని తన ఇంట్లో వినాయక పూజకు అవసరమైన నీటిని తీసుకురావడానికి వెళ్లిన ఆయన.. ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మృతి చెందినట్లు సమాచారం. శివమొగ్గల్లోనే వ్యవసాయ ఉద్యాన వన విద్యాలయ ఉపకులపతిగా విశేష సేవలు అందించారు. పదవి విరమణ అనంతరం మణిపాల్ విద్యాలయ జీవ శాస్త్ర విభాగ నిపుణుడిగా సేవలు అందించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





