సోహైల్ ఖాన్ నివాసంలో జరిగిన గణపతి హారతి వేడుకల్లో సల్మాన్ ఖాన్ పాల్గొన్నారు. హారతి ఇచ్చే సమయంలో సల్మాన్ ఖాన్ సరైన దిశలో పళ్లెం తిప్పకపోవడంతో పక్కనే ఉన్న ఆయన చెల్లెలు అర్పితా ఖాన్ సరిచేశారు. ఈ క్యూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనంతరం తన మేనకోడలికి హారతి పద్ధతిని సల్మాన్ వివరించారు. బిల్డింగ్ ప్రాంగణంలోనే నీటి ట్యాంక్ ఏర్పాటు చేసి గణపతి నిమజ్జనం చేశారు.
N





