
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్సీ, రిక్రూటింగ్ ఏజెన్సీలు చేసే నియామకాలకు గరిష్ఠ వయోపరిమితిని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వయోపరిమితి పెంపు వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు ఉంటుంది. యూనిఫాం సర్వీసులకు రెండేళ్లపాటు సాధారణ కేటగిరీలో వయోపరిమితి పెంచగా, నాన్ యూనిఫామ్ సర్వీసులకు 42 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచింది. మిగిలిన నియామకాలకు గరిష్ఠ వయోపరిమితి 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచింది. రిజర్వుడ్ కేటగిరీలకు సడలింపులు యథాతథంగా ఉంటాయి.





