
తెలంగాణ ఏర్పాటైన తర్వాత హైదరాబాద్ నగరం మరింత విస్తరించింది. హైదరాబా్ ఆర్థిక శక్తితో రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలు కొత్త సంబంధాలను ఏర్పాటు చేసుకున్నాయి. ఔటర్ రింగ్ రోడ్ నగర రవాణా అవసరాలను తీర్చే ఓ రహదారిగానే ప్రారంభమైనప్పటికీ.. అది క్రమంగా ఓ అభివృద్ధి వలయంలా మారింది. ఫలితంగా తెలంగాణకు హైదరాబాద్ ఓ గ్రోత్ ఇంజిన్‌లా మారింది. ఇప్పుడు రీజినల్ రింగ్ రోడ్ ఏర్పాటుతో నగరం మరింతగా విస్తరించే అవకాశం ఉంది.






