హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసింది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం.. అసెంబ్లీ స్పీకర్ దానం నాగేందర్‌పై అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని పక్కనపెట్టింది. దీంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు కోర్టు స్పష్టం చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు […]