
ఓ వివాహితపై యాసిడ్తో దాడి చేసిన దారుణ ఘటన నిజామాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా బిక్కనూరు మండలానికి చెందిన దివ్యవాణి అనే మహిళకు.. పది సంవత్సరాల క్రితం నిజామాబాద్ పట్టణానికి చెందిన అరవింద్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే, గత కొన్ని నెలలుగా దంపతుల మధ్య కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. ఈ మనస్పర్థల కారణంగా దివ్యవాణి తన తల్లిగారి ఊరైన బిక్కనూర్ కు వచ్చి అక్కడే ఉంటోంది.





