
Teachers Protest Govt Inaction As Mlc Sripal Reddy Demands Answers Regarding The Alleged 10percent Commission Telugu...
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Government Employees: ఉపాధ్యాయులపై చిన్న చిన్న ఆరోపణలు వస్తేనే సస్పెండ్ చేస్తున్న ప్రభుత్వం.. ఆర్థిక శాఖ మంత్రి భార్యపై 10శాతం కమీషన్ ఆరోపణలు వచ్చినా.. ఎందుకు చర్యలు తీసుకోలేదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి ప్రశ్నించారు. సాధారణ ఉపాధ్యాయుపై చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం ఓ రిటైర్డె ఉద్యోగురాలు బహిరంగాంగానే మంత్రి సతీమణిపై ఆరోపణలు చేసినా ఎందుకు స్పందించలేదో సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ లోని ఇందిరాపార్కు వద్ద మహా ధర్నా కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా మాట్లాడిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. ఎన్నికల ముందు ఉపాధ్యాయులకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఈరెండున్నరేళ్లలో మొదటి తారీఖున జీతం ఇవ్వడం మినహా చేసిందేమీ లేదంటూ ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వం 2 డీఏలు పెండింగ్ లో ఉంటే ఈ పాలనలో అవి ఏకంగా 6కు చేరుకున్నాయన్నారు. 2023 చివరి నాటికి రూ. 4వేల కోట్లుగా ఉన్న ఉద్యోగుల బకాయిలు.. ఇప్పుడు ఏకంగా రూ. 16వేల కోట్లకు చేరుకున్నాయని ఈ సందర్భంగా శ్రీపాల్ రెడ్డి తెలిపారు. ఇక ఉద్యోగుల నుంచి 4 దఫాలుగా చందాలు వసూలు చేసినా.. ఉపాధ్యాయులకు ఆరోగ్య పథకాన్ని అమలు చేయడంలో సర్కార్ దారుణంగా విఫలమైందని మండిపడ్డారు. 2034 వరకు ముఖ్యమంత్రిగా ఉంటానని చెబుతున్న రేవంత్ రెడ్డి.. ఆ పదవిలో కొనసాగాలంటే మానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని శ్రీపాల్ రెడ్డి స్పష్టం చేశారు. అంతేకాదు పాలిటెక్నిక్ విద్య విషయంలోనూ ప్రభుత్వం తీసుకుంటున్న తొందరపాటు నిర్ణయాలు పునపరిశీలించాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ముఖ్యమంత్రి మాటకు విలువ లేకుండా పోతుందని... ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోనట్లయితే.. రానున్న రోజుల్లో టీచర్లంతా రోడెక్కి నిరననను మరింత ఉద్రుతం చేస్తామని హెచ్చరించారు.
రాష్ట్రంలో అసలు పీఆర్సీ కమిటి మనుగడలో ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పాత పీఆర్సీ కమిటీని రద్దు చేసి.. దాని స్థానంలో కొత్త పీఆర్సీ కమిటీ నిర్ణయిస్తామని చెప్పి 6 నెలల్లోనే నివేదిక తెప్పించుకని మెరుగైన ఫిట్ మెంట్ ఇస్తామని చెప్పారు. కానీ పాత ప్రభుత్వం వేసిన పీఆర్సీ కమిటీనే పొడిగిస్తూ వస్తున్నారు. అసలు మార్చి 31 తర్వాత రాష్ట్రంలో పీఆర్సీ కమిటీ మనుగడలో ఉందా లేదా అనేది తెలియని పరిస్థితులు నెలకున్నాయని ఫైర్ అయ్యారు. పీఆర్సీ రిపోర్టును ఎందుకు తెప్పించుకోలేకపోతున్నారంటూ నిలదీశారు. ఆర్థిక శాఖలో ఏం జరుగుతుందో తెలియని పరిస్ధితులు నెలకొన్నాయన్నారు.
సీపీఎస్ రద్దు చేస్తామని మానిఫెస్టోలో పెట్టాలేదా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు శ్రీపాల్ రెడ్డి. 2003 డీఎస్సీ టీచర్లకు పాత పెన్షన్ అమలు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన తెల్లవారే అధికారులు వెళ్లి సుప్రీంకోర్టులో కేసులు వేయడం దారుణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఏఎస్ లకు పాత పెన్షన్ వర్తిస్తుంది..కానీ ఉద్యోగులకు మాత్రం వర్తించదా అని ప్రశ్నించారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి 825 రోజులే మిగిలియానని 1000 రోజుల పాలనలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలపై ఏం చేశారో పునరాలోచించాలని శ్రీపాల్ రెడ్డి సూచించారు. మొదటి అర్థభాగం ముగిసింది.. రెండో అర్థభాగం మాత్రమే మిగిలింది.. మరి హామీల అమలు ఎప్పుడంటూ ప్రశ్నించారు. రిటైర్డ్ ఉద్యోగులకు కోటి చెల్లిస్తున్నామని చెబుతున్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు శ్రీపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కోటి దేవుడికి తెలుసుకానీ.. 13-16 లక్షల గ్రాట్యుటీ తప్పా మిగతాదంతా ఉద్యోగులు దాచుకున్న సొమ్మే కదా అని పేర్కొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.





