
ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆ పాఠశాలలో ఒకే ఒక్క విద్యార్థికి పాఠాలు బోధించడానికి ఉపాధ్యాయుడు ప్రతిరోజూ 5కీలో మీటర్లు ట్రెక్కింగ్‌ చేసి మరీ స్కూల్‌కు వెళ్తున్నారు. సరైన రహదారి లేకపోయినా.. క్రూర మృగాలతో ప్రమాదం పొంచి ఉన్నా ప్రతిరోజూ క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరవుతున్నారు. ఆయనే మహారాష్ట్ర ( Maharashtra )లోని కొల్హాపూర్ జిల్లాకు చెందిన 55ఏళ్ల ఉపాధ్యాయుడు జీవన్ మిథారి (Jivan Mithari). గత 13ఏళ్లుగా, కొల్హాపూర్-సింధుదుర్గ్ సరిహద్దు సమీపంలోని మారుమూల గ్రామం కవల్టెక్ ధంగర్‌వాడలోని జిల్లా పరిషత్ పాఠశాలలో మిథారి (Jivan Mithari) విధులు నిర్వర్తిస్తున్నారు. మారుమూల గ్రామం కావడంతో విద్యుత్తు, రహదారులు వంటి కనీస సౌకర్యాలు కూడా లేవు. రోడ్డుపైకి వెళ్లాలంటే సుమారు 2.5 కిలోమీటర్లు నడవాల్సిందే. ఒకప్పుడు ఈ పాఠశాలలో చాలా మంది విద్యార్థులు ఉండే వారు. కాలక్రమేణా జీవనోపాధి కోసం అనేక కుటుంబాలు కొల్హాపూరర్‌కు తరలివెళ్లాయి. దీంతో పాఠశాలకు వచ్చే పిల్లల సంఖ్య కూడా తగ్గిపోయింది. ప్రస్తుతం మూడో తరగతి విద్యార్థిని స్వరా బోడకే మాత్రమే అందులో చదువుతోంది. గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రం లేకపోవడంతో తన చెల్లిని కూడా తరగతులకు తీసుకువస్తోంది. మారుమూల ప్రాంతాల్లో నివసించే వారికి విద్య అందడం కష్టతరమైన విషయమని.. అందువల్లే ఒక్క విద్యార్థి ఉన్నా ఉపాధ్యాయుడిగా తన బాధ్యతను నిర్వర్తించడం కోసం ప్రతిరోజూ పాఠశాలకు వస్తున్నానని జీవన్ మిథారి పేర్కొన్నారు. ఇదీ చదవండి: మహిళా బైకర్‌ను వెంటాడి.. కారుతో ఢీకొట్టి..! .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




