
తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండోరోజు శ్రీమలయప్పస్వామి బుధవారం సాయంత్రం హంస వాహనంపై సరస్వతి అమ్మవారి అలంకారంలో తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా కళాకారుల ప్రత్యేక ప్రదర్శనలు ఆకట్టకున్నాయి.





