
దివంగత నటి శ్రీదేవికి చెందిన ఆస్తి కేసుపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్డులో 1988లో శ్రీదేవికి విక్రయించిన 2.7 ఎకరాల భూమిలో తమకూ వాటా ఉందంటూ ఎంసీ చంద్రశేఖరన్ కూతురు ఎంసీ శివగామి, కుమారుడు ఎంసీ నటరాజన్ దాఖలు చేసిన పిటిషన్‌పై శ్రీదేవి భర్త బోనీ కపూర్, వారి కూతుళ్లు జాహ్నవి కపూర్, ఖుషీ కపూర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.





