
రాష్ట్రంలో సెమీ కండక్టర్ల పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు సింగపూర్ ప్రతినిధులు ముందుకొచ్చారు. బుధవారం అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో సింగపూర్ వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇంధనవాణిజ్య విభాగం శాశ్వత కార్యదర్శి అగస్టిన్ లీ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం సీఎం రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయింది.





