
ఇంటర్నెట్‌ డెస్క్: పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న షహజాబ్‌ భట్టీ నెట్‌వర్క్‌ (SBN)ను ‘చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం’ (యూఏపీఏ-ఉపా) కింద నిషేధిత ఉగ్రసంస్థగా కేంద్రం ప్రకటించింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘ఈ నెట్‌వర్క్‌.. సరిహద్దుల గుండా ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతోంది. యువతను, నేరస్థులను ఉగ్రవాదం దిశగా ప్రేరేపిస్తోంది. భారత ప్రజాస్వామ్య వ్యవస్థను, మత సామరస్యాన్ని లక్ష్యంగా చేసుకుని.. విద్వేషపూరిత డిజిటల్ కంటెంట్‌ వ్యాప్తి చేస్తోంది’’ అని అమిత్‌ షా తెలిపారు. ప్రభుత్వ వివరాల ప్రకారం.. ఎస్‌బీఎన్‌ అనేది పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఒక ఉగ్రవాద గ్రూప్‌. భారత్‌లో పలు బాంబు దాడులు, హత్యల వెనుక దీని హస్తం ఉంది. పోలీస్, రక్షణ, మతపరమైన ప్రదేశాలను రెక్కీ చేసేందుకు, గూఢచర్యం కోసం సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు స్థానిక మధ్యవర్తులకు డబ్బు చెల్లిస్తోంది. దిల్లీ, పంజాబ్ ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, హరియాణా, ఉత్తరాఖండ్‌లో భట్టీపై కేసులు నమోదయ్యాయి. భారత్‌ నిషేధించిన ఉగ్రసంస్థల జాబితాలో ఎస్‌బీఎన్‌ 46వది. కేంద్ర క్యాబినెట్‌ గుడ్‌న్యూస్‌.. EPF వేతన పరిమితి పెంపు పాకిస్థాన్‌ ( Pakistan )లోని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన షహజాద్ భట్టీ.. దోపిడీలతో నేర ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. తర్వాత అతడు పాక్ నుంచి యూఏఈకి మకాం మార్చాడు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





