
హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ పీఆర్వో, పీఏ మహేశ్‌, మహేందర్‌లపై సైఫాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో దాడి జరిగిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ముసుగు ధరించిన పోలీసులే దాడి చేశారన్నారు. విచారణ గదిలోకి వెళ్లి మరీ వారిపై పోలీసులు దాడికి యత్నించారని, బీఆర్‌ఎస్‌ లీగల్‌ టీమ్‌ కేకలు వేయడంతో పారిపోయారని పేర్కొన్నారు. తన పీఆర్వో, పీఏపై దాడి దుర్మార్గమని కేటీఆర్‌ మండిపడ్డారు. రేవంత్‌ పాలనలో రౌడీలు, గూండాల రాజ్యం నడుస్తోందని విమర్శించారు. ఈ దాడిపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. హరీశ్‌రావు చేసిన ఆరోపణలను సైఫాబాద్‌ పోలీసులు ఖండిస్తూ వివరణ ఇచ్చారు. ‘‘గణేశ్‌ మండపం వద్ద డీజే పర్మిషన్‌ కోసం యువకులు పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. అసెంబ్లీ వద్ద న్యూసెన్స్‌ చేసిన వారిని కూర్చోబెట్టి మాట్లాడుతున్నారని ఆ యువకులు వాగ్వాదానికి దిగారు. దీంతో వారిని పీఎస్‌ నుంచి పంపేశాం. పోలీసుల సమక్షంలోనే దాడి చేశారన్న ప్రచారంలో నిజం లేదు’’ అని పోలీసులు తెలిపారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. గణేశ్ చతుర్థి సందర్భంగా హైదరాబాద్‌లోని బేగం బజార్‌లో ‘గోల్డ్ ప్రిన్స్’ వినాయకుడిని ప్రతిష్ఠించారు. నల్గొండ (Nalgonda) జిల్లా నేరడుగొమ్ము మండలం వైజాగ్‌ కాలనీలో ఓ కారు (car) బీభత్సం సృష్టించింది. జగిత్యాల(Jagitial) జిల్లాకు చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ మరోసారి తన ప్రతిభను చాటారు.





