
హైదరాబాద్, సెప్టెంబర్ 17: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) జూనియర్ ఇంజినీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS), కెమికల్ అండ్ మెటలార్జికల్ అసిస్టెంట్ (CMA) పోస్టుల భర్తీకి సంబంధించిన CBT-1 పరీక్ష షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించిన కంప్యూటర్ ఆధారిత పరీక్షలు అక్టోబర్ 27, 28, 30 తేదీల్లో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 4,029 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో సికింద్రాబాద్ రైల్వే జోన్కు 111 పోస్టులు కేటాయించారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 13తో ముగిసింది. అయితే అభ్యర్థులకు దరఖాస్తుల్లో తప్పులు సరిదిద్దుకునేందుకు సెప్టెంబర్ 16 నుంచి 25వ తేదీ వరకు సవరణ అవకాశం కల్పించారు. అభ్యర్థులు ఈ గడువులోగా అవసరమైన మార్పులు చేసుకోవచ్చు.





