
హైదరాబాద్ హైటెక్ సిటీ పరిధిలోని మాదాపూర్లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ కో-లివింగ్ హాస్టల్లో ఉంటున్న 23 ఏళ్ల సాఫ్ట్వేర్ ఉద్యోగి భవనం నుంచి కిందకు దూకి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. మృతుడిని శ్రీకాకుళం జిల్లా పాతపట్నానికి చెందిన యశ్వంత్గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.





