

- కీసర అధికారుల అరెస్ట్
- లంచం తీసుకుంటూ చిక్కారు
- ఏసీబీకి దొరికిన పోలీసులు
Keesara ACB Raid: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి అవినీతి నిరోధక శాఖ (Keesara ACB Raid) నిర్వహించిన సోదాలు తీవ్ర సంచలనం సృష్టించాయి. ఒక కేసులో నిందితుడికి బెయిల్ మంజూరు చేయడానికి సీఐ ఆంజనేయులు ఏకంగా రూ.10 లక్షల లంచం డిమాండ్ చేశారు. అంతటితో ఆగకుండా బాధితుడితో సొంత పనులు చేయించుకోవడమే కాకుండా, కొన్నిరోజులుగా బిర్యానీలు, కూల్‌డ్రింక్స్ తదితరాలు తెప్పించుకుంటూ తీవ్ర వేధింపులకు గురిచేశారు. ఈ వేధింపులను తట్టుకోలేకపోయిన బాధితుడు చివరకు ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో అసలు వ్యవహారం బయటపడింది.
AP High Court: బీసీలకు 34 శాతం రిజర్వేషన్.. ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం.. స్థానిక పోరుపై ఉత్కంఠ!
బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ డీఎస్పీ మాజీద్ అలీఖాన్ ఆధ్వర్యంలో అధికారులు వ్యూహాత్మకంగా రంగంలోకి దిగారు. సీఐ సూచన మేరకు బాధితుడి నుంచి రూ.5 లక్షల తొలి విడత లంచం సొమ్మును కీసర చెరువుగట్టు వద్ద నిమజ్జనం డ్యూటీలో ఉన్న ఎస్సై జ్ఞానేందర్‌రెడ్డి స్వీకరిస్తుండగా ఏసీబీ దాడి చేసింది. అధికారులను చూసి ఎస్సై అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించడమే కాక, కెమికల్ టెస్టులకు సహకరించకుండా ముప్పుతిప్పలు పెట్టాడు. చివరకు ఎస్సై జ్ఞానేందర్‌రెడ్డితో పాటు లంచం డిమాండ్ చేసిన సీఐ ఆంజనేయులును కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.




