

Tharun Bhascker – Eesha Rebba : దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ గత కొంతకాలంగా హీరోయిన్ ఈషారెబ్బతో ప్రేమలో ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి హీరో – హీరోయిన్ గా ఓం శాంతి శాంతిః అనే ఒక సినిమా కూడా చేసారు. ఆ సినిమా ఆడలేదు అది వేరే విషయం అనుకోండి. ఆ సినిమా ఆడకపోయినా వీరి ప్రేమ పండింది. ముందు నుంచే మంచి పరిచయం ఉన్న ఈ జంట ఆ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు.
అప్పట్నుంచి వీరి ప్రేమపై రూమర్స్ వచ్చినా ఎవరూ స్పందించలేదు. తరుణ్ భాస్కర్ మాత్రం ఓ ఇంటర్వ్యూలో సమయం వచ్చినప్పుడు చెప్తాను అని తెలిపాడు. ఆ సమయం ఇప్పుడు వచ్చింది. వినాయక చవితి పండగ సందర్భంగా తరుణ్ భాస్కర్ – ఈషారెబ్బ కలిసి వినాయక విగ్రహం ముందు కూర్చొని దిగిన ఫోటోని తరుణ్ తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు.
Also Read : Sudheer – Srishti : కట్టప్పగా మారిన సుధీర్.. సృష్టి కోసమేనా..? త్రిగున్ చెప్పింది నిజం అవుతుందా?
ఈ ఫొటోతో పెళ్ళికి ముందే ఈ ఇద్దరూ కలిసి వినాయక పూజని నిర్వహించారని తెలుస్తుంది. ఈ ఫోటోని షేర్ చేయడంతో వీళ్ళ ప్రేమ రూమర్స్ కాదు నిజమే అని క్లారిటీ ఇచ్చేసాడు తరుణ్. మారి వీళ్ళు వివాహం ఎప్పుడు చేసుకుంటారో చూడాలి. ఈషారెబ్బ ఇటీవలే కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసింది. ఇక తరుణ్ కి ఇది రెండో పెళ్లి అవుతుంది. గతంలో ఓ ఫ్యాషన్ డిజైనర్ ని పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్నాడు.
Found this helpful?
Share this story with your network





