
PM Narendra Modi : స్వదేశంలో జరిగిన బ్రిక్స్-2026 సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) దూకుడు చూపించారు. 18వ బ్రిక్స్ సమావేశాలకు అధ్యక్షత వహించిన మోడీ ‘న్యూ ఢిల్లీ డిక్లరేషన్'(New Delhi Declaration)కు ఏకగ్రీవంగా ఆమోదం లభించడంలో కీలకంగా వ్యవహరించడమే కాకుండా ద్వైపాక్షిక సమావేశాలతో బిజీగా గడిపారు. మూడు రోజుల్లోనే ఆయన 15 సమావేశాలు నిర్వహించారు. బ్రిక్స్ దేశాధినేతలు, ప్రతినిధులతో పాటు ఈ సదస్సుకు విచ్చేసిన అంతర్జాతీయ సంస్థల అధిపతులతో మోడీ దౌత్య చర్చలు జరిపారు. న్యూ ఢిల్లీలోని భరత మండపంలో నిర్వహించిన బ్రిక్స్ 2026 సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ ద్వైపాక్షిక చర్చలకు అధిక ప్రాధాన్యమిచ్చారు. సదస్సుకు విచ్చేసిన 11 దేశాల ప్రతినిధులతో అధికార చర్చలు సాగించిన ఆయన.. విరామాల్లో అంతర్జాతీయ సంస్థల అధికారులతోనూ ముచ్చటించారు. సదస్సుకు ముందు రోజుతో కలిపి.. మూడు రోజుల్లో మోడీ 15 ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో రక్షణ, ఇంధనం, అణుశక్తి, సంక్షిష్ట లవణాల గురించి మాట్లాడిన భారత ప్రధాని.. ఆపై ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కీ, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ అంటోనియో గుటెర్రెస్‌తోనూ భేటీ అయ్యారు. Thank you to all BRICS leaders for making the Delhi Summit very productive and outcome oriented! pic.twitter.com/C3DMZWGgLL — Narendra Modi (@narendramodi) September 13, 2026 ఇక బ్రిక్స్ సమావేశాల రోజు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ఇండోనేషియా అధిపతి, మలేషియా ప్రధాని, ఇథియోపియా ప్రధాని, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు, యూఏఈ యువరాజుతోనూ మోడీ ముచ్చటించారు. ఈజిప్ట్, నైజీరియా, బురుండీ, ఉగాండ ప్రతినిధులతోనూ ప్రధాని పలు ద్వైపాక్షిక అంశాలు చర్చించారు. ఈ దౌత్యపరమైన భేటీల్లో .. రక్షణ, వాణిజ్యం అంశాలకు ఆయన అధిక ప్రధాన్యమిచ్చారు. Delighted to meet Vice President Kashim Shettima of Nigeria on the sidelines of the Delhi BRICS Summit. We discussed cooperation in areas such as trade, power, clean energy, fertilisers and defence. We also reviewed cooperation in health, capacity building, technology and… pic.twitter.com/ZNp4YibXVC — Narendra Modi (@narendramodi) September 13, 2026 Glad to meet President Kassym-Jomart Tokayev during his first visit to India as President. We had a very productive discussion on giving fresh momentum to the India-Kazakhstan Strategic Partnership. We see immense potential to deepen cooperation in trade, investment, energy,… pic.twitter.com/fIc6AHPUAf — Narendra Modi (@narendramodi) September 13, 2026



