
కనిగిరి: ఉమ్మడి ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని ప్రైవేటు పాఠశాలలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన చిన్నారి తౌషిక్.. న్యాయం జరగాలంటూ ఆత్మహత్య చేసుకున్న తల్లి మౌలాబిల మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కనిగిరి ఈద్గా వద్ద కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మృతదేహంతో రోడ్డు మీద బైఠాయించారు. మృతికి కారణమైన సింగరాయకొండ ప్రైవేటు పాఠశాల యజమాన్యంపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు డిమాండ్‌ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అడిషనల్‌ ఎస్పీ నవజ్యోత్‌ మిశ్రా ఆందోళనకారులతో మాట్లాడారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో బంధువులు ఆందోళన విరమించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




