
ఏపీ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ కాన్వాయ్‌కు ప్రమాదం తప్పింది. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకి వద్ద కాన్వాయ్‌కు గుర్తు తెలియని వ్యక్తి అడ్డుగా వచ్చాడు. భద్రతా సిబ్బంది వెంటనే స్పందించడంతో ప్రమాదం తప్పింది. మచిలీపట్నంలో 63 అడుగుల గణపతిని గవర్నర్‌ దర్శించుకొని తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.





