
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి తిరుపతిలో భక్తులకు జారీ చేసే ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీని సోమవారం నుంచి ఈనెల 19వ తేదీ వరకు నిలిపివేశారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల రద్దీ నేపథ్యంలో 6 రోజులు భక్తులను నేరుగా తిరుమల క్యూలైన్లలోకి అనుమతించేలా నిర్ణయం తీసుకున్నట్లు తితిదే ప్రకటించింది. ఈనెల 21న దర్శనానికి సంబంధించిన ఎస్‌ఎస్‌డీ టోకెన్లను 20న జారీ చేయనుంది. టోకెన్లు జారీ చేయబోమని అధికారులు ముందస్తుగా తెలపకపోవడంపై భక్తులు ఆవేదన వ్యక్తంచేశారు.





