
దిల్లీ: అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న తొలి టీ20లో భారత ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ దూకుడుగా ఆడుతున్నాడు. 22 బంతుల్లో హాఫ్‌ సెంచరీ చేశాడు. అభిషేక్‌కు ఇది 12వ టీ20 అర్ధశతకం. 10 ఓవర్లకు భారత్‌ స్కోరు 130/1. అభిషేక్‌ శర్మ 74*(29 బంతుల్లో), ఇషాన్‌ కిషన్‌ 34*(23 బంతుల్లో) క్రీజులో ఉన్నారు. సంజు శాంసన్‌ (10) పరుగులు చేశాడు. భారత్‌ విజయానికి 60 బంతుల్లో ఇంకా 27 పరుగులు అవసరం.



