
దుబాయి: శ్రీలంకతో జరుగుతున్న మహిళల ఆసియాకప్‌ ఫైనల్‌లో నిర్ణీత 20 ఓవర్లలో భారత్‌ 183/5 స్కోరు చేసింది. ఓపెనర్లు షెఫాలీ వర్మ (68), స్మృతి మంధాన (59) అర్ధ శతకాలు బాదారు. ఇద్దరు కలిసి తొలి వికెట్‌కు 129 (77 బంతుల్లో) పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రిచా ఘోష్‌ (17), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (14) పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో మిథాలీ అయోధ్య, చమరి ఆటపట్టు, ప్రబోధ తలో వికెట్‌ తీశారు.





