
Tirumala Police Alert Devotees On Tags For Kids And Old People: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చిన్నారులు, వృద్ధుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పిల్లలు, వృద్ధులకు బయో ట్యాగ్ల ఏర్పాటు చేస్తున్నారు. ఆ ట్యాగ్‌పై వారి వివరాలు నమోదు చేస్తున్నారు. ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ముందస్తు అవగాహన కల్పిస్తూ.. భద్రతా సూచనలపై విస్తృత ప్రచారం చేస్తున్నారు. భక్తుల ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పటిష్టమైన పోలీస్ భద్రతా చర్యలు చేపట్టారు. చిన్నారులు, వృద్ధులు తప్పిపోకుండా పోలీస్ సిబ్బందితో ప్రత్యేక నిఘా ఉంచారు.





