
నిజాం పాలనలో హైదరాబాద్‌కు ప్రపంచస్థాయి గుర్తింపు వచ్చిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌లో ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ముందుగా అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. 1948 సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ అధికారికంగా భారత్‌లో అంతర్భాగమైందన్నారు. రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పాలనకు మార్గం తెరుచుకున్న చారిత్రక సందర్భంగా సెప్టెంబర్‌ 17ను ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. ప్రజల ఆత్మగౌరవానికి పట్టం కడుతూ ప్రజాపాలన కొనసాగిస్తున్నామన్నారు.