
వృద్ధుడిని మోసగించిన వంట కార్మికుడు కంబాలచెరువు(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: వైద్యం చేయిస్తానని, అన్నీ తానై చూసుకుంటానని నమ్మించి ఓ విశ్రాంత ఉద్యోగి వద్ద ఓ వ్యక్తి రూ.14.78 లక్షలు కాజేసిన ఘటన ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. బుధవారం పోలీసుల వివరాల ప్రకారం.. నగరంలోని వంకాయలవారి వీధికి చెందిన కాబోలు యోగానరసింహరావు(84) జూనియర్‌ అకౌంట్స్‌ అధికారిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. భార్య, కుమారుడు చనిపోవడంతో తనను చూసుకునేవారు లేక విజయవాడలోని ఓ వృద్ధాశ్రమంలో చేరారు. అక్కడ వంట పనిచేసే మేకల వెంకటేశ్వరరావు అన్ని విధాలుగా అండగా ఉంటానని, సహాయం చేస్తానని వృద్ధుడిని నమ్మించాడు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అతనికి వైద్యం చేయిస్తానని హైదరాబాద్‌ తీసుకెళ్లి అక్కడ ఒక చోట పది రోజులు ఉంచాడు. బాధితుడికి తెలియకుండా అతని బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.14,78,391 నగదును విడతల వారీగా వెంకటేశ్వరరావు తన ఖాతాకు మళ్లించుకున్నాడు. దీనిని గుర్తించిన వృద్ధుడు బుధవారం రాజమహేంద్రవరం వచ్చి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఒకటో పట్టణ పోలీసులు తెలిపారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




