
Nani’s The Paradise | నేచురల్ స్టార్ నాని, పవర్ ఫుల్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అంటెసిపేటెడ్ యాక్షన్ థ్రిల్లర్
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

Nani’s The Paradise | నేచురల్ స్టార్ నాని, పవర్ ఫుల్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అంటెసిపేటెడ్ యాక్షన్ థ్రిల్లర్
Nani’s The Paradise | నేచురల్ స్టార్ నాని, పవర్ ఫుల్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అంటెసిపేటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’ (The Paradise) చిత్రం విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ బాక్సాఫీస్ వద్ద అంచనాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా పూర్తి స్థాయి అడ్వాన్స్ బుకింగ్‌లు ఇంకా ప్రారంభం కాకముందే, ఈ సినిమా ప్రీ-సేల్స్ ద్వారా రికార్డులను తిరగరాస్తూ అద్భుతమైన ఓపెనింగ్స్‌కు సిద్ధమవుతోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఈ చిత్రానికి సంబంధించి ప్రీ-సేల్స్ ఊహించని రీతిలో దూసుకుపోతున్నాయి. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఒక్క హైదరాబాద్ నగరంలోనే 50,000లకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం గమనార్హం. దీని ద్వారా కేవలం ప్రీ-సేల్స్ రూపంలోనే భారీ వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమామై వస్తున్న భారీ స్పందన చూస్తుంటే సినిమాపై ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్ ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. సినిమా విడుదల తేదీకి ఇంకా మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండటం, అదీ కూడా దేశవ్యాప్తంగా ఫుల్-ఫ్లెడ్జ్డ్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా జోరుగా పుంజుకోవాల్సి ఉండగానే ఈ స్థాయి రెస్పాన్స్ రావడం టాలీవుడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది. నాని గత చిత్రం ‘దసరా’ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా ఉండటంతో తొలి రోజు కలెక్షన్లు ఊహించని స్థాయిలో ఉండే అవకాశం కనిపిస్తోంది.
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: Namasthe Telangana లో చూడండి






