
ఇంటర్నెట్‌ డెస్క్: వచ్చే నెలలో భారత్‌ వేదికగా హాకీ ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ ప్రారంభం కానుంది. అయితే.. భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు పాకిస్థాన్‌ హాకీ ఫెడరేషన్‌ (పీహెచ్‌ఎఫ్‌) నిరాకరించింది. ఈ టోర్నీని మొత్తాన్నయినా వేరే దేశానికి మార్చాలని, లేదా తాము ఆడే అన్ని మ్యాచ్‌లకు ఏదైనా తటస్థ వేదికను కేటాయించాలని ఆసియా హాకీ ఫెడరేషన్‌ను కోరింది. ఆతిథ్య దేశంతో నెలకొన్న సున్నితమైన ద్వైపాక్షిక పరిస్థితుల దృష్ట్యా ఈ విజ్ఞప్తి చేసినట్లు తెలిపింది. పాక్ బ్యాటర్‌ను వెనక్కి నెట్టి.. మళ్లీ రెండో స్థానంలోకి అభిషేక్ టోర్నీలో తమ దేశం ( Pakistan ) ఎలాంటి అంతరాయం లేకుండా పూర్తిస్థాయిలో పాల్గొనేలా చూసేందుకే తటస్థ వేదిక కావాలని కోరుతున్నట్లు పేర్కొంది. ఇరుదేశాల మధ్య సంబంధాలు, భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. క్రీడాకారులు, సిబ్బందికి సురక్షితమైన, అనుకూలమైన వాతావరణాన్ని కల్పించే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీహెచ్‌ఎఫ్‌ తాత్కాలిక అధ్యక్షుడు మొహియుద్దీన్ అహ్మద్ వానీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. సంజు శాంసన్‌ (57; 22 బంతుల్లో 7x4, 4x6) రెచ్చిపోవడంతో అఫ్గానిస్థాన్‌తో రెండో టీ20లో భారత్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.





