
ఇంటర్నెట్‌ డెస్క్: ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి (MS Subbulakshmi) జీవిత కథని తెరపైకి తీసుకురాబోతున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. నేడు ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన విడుదలైంది. ఇందులో సుబ్బులక్ష్మి పాత్రలో రష్మిక నటించనున్నట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. ‘ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి అమ్మ’ (MS Subbulakshmi Amma) పేరుతో ఈ బయోపిక్‌ రూపొందనుంది. సుబ్బులక్ష్మి 116వ జయంతిని పురస్కరించుకొని సెప్టెంబర్‌ 16న ఈ బయోపిక్‌ను ప్రారంభించనున్నట్లు నిర్మాతలు తెలిపారు. చెన్నై వేదికగా గ్రాండ్‌ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి అగ్రకథానాయకుడు కమల్‌ హాసన్‌ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఇక ఈ ప్రతిష్ఠాత్మక సినిమాకు గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా.. అనిరుధ్‌ సంగీతం అందించనున్నారు. ఈ బయోపిక్‌లో మొదట సాయిపల్లవి, రుక్మిణీ వసంత్‌, కీర్తిసురేశ్‌ పేర్లు వినిపించాయి. చివరికి రష్మిక ( Rashmika )ను ఫైనల్‌ చేశారు. ఎంఎస్‌ సుబ్బులక్ష్మి పాత్ర కోసం రష్మిక.. ఇప్పటికే లుక్‌ టెస్ట్‌ కూడా చేయించుకున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





