
పర్లాఖెముండి: గజపతి జిల్లా రాయగడ సమితి కార్యాలయం ప్రాంతంలో ఉన్న గ్రామీణ గృహ నిర్మాణ శాఖ కార్యాలయంలో బుధవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన చేరుకొని మంటలను అదుపు చేశారు. కార్యాలయంలోని ఏసీ, కంప్యూటర్, ప్రింటర్, ముఖ్యమైన పత్రాలు, ఫర్నిచర్, ఇతర అవసరమైన వస్తువులు బూడిదయ్యాయి. రూ. లక్షల రూపాయల విలువైన ఆస్తి నష్టంతో పాటు అనేక దస్త్రాలు ధ్వంసం అయ్యాయని అధికారులు తెలిపారు. కార్యాలయం సెలవు దినం కావడంతో పెనుప్రమాదం తప్పింది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





