
ఎస్టీ గురుకుల సొసైటీ పరిధిలోని పాఠశాలల్లో విద్యార్థుల విద్య, ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత, భద్రత, ఉజ్వల భవిష్యత్తు లక్ష్యంగా అధికారులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హెల్త్ కమాండ్ సెంటర్ అధికారుల సమన్వయంతో ‘నాతోనే మార్పు’ పేరుతో ప్రత్యేక తల్లిదండ్రుల–ఉపాధ్యాయుల సమావేశాలను నిర్వహించారు.





